Header Banner

ఆ సాంగ్‌కు డ్యాన్స్‌ చేసిన వరుడు! పెళ్లి రద్దు చేసిన వధువు తండ్రి!

  Sun Feb 02, 2025 17:29        India

పెళ్లిలో సరదాగా తన ఫ్రెండ్స్‌తో కలిసి డ్యాన్స్ చేసిన వరుడికి వధువు తండ్రి షాక్‌ ఇచ్చాడు. ‘చోళీ కే పీచే క్యా హై’ సాంగ్‌కు వరుడు డ్యాన్స్‌ చేయడంపై ఆగ్రహం చెందాడు. దీంతో పెళ్లిని రద్దు చేసి అక్కడి నుంచి వెళ్లిపోయాడు. విస్తూపోయే ఈ సంఘటన దేశ రాజధాని ఢిల్లీలో జరిగింది. పెళ్లికుమారుడు తన కుటుంబం, బంధువులతో కలిసి ఊరేగింపుగా పెళ్లి వేదిక వద్దకు చేరుకున్నాడు. అయితే సరదాగా డ్యాన్స్‌ చేయాలని స్నేహితులు ఒత్తిడి చేశారు. ‘చోలీ కే పీచే క్యా హై’ సాంగ్‌ ప్లే చేయడం, ఫ్రెండ్స్‌ డ్యాన్స్‌ చేయడంతో వరుడు కూడా వారితో కలిశాడు. ఆ పాటకు తగ్గట్టుగా హావభావాలతో డ్యాన్స్‌ చేశాడు. కాగా, వరుడి డ్యాన్స్‌ చూసి వధువు తండ్రి ఆగ్రహంతో రగిలిపోయాడు. పెళ్లి తంతును వెంటనే ఆపించాడు. పెళ్లికొడుకు చర్యల వల్ల తమ కుటుంబ విలువలకు అవమానం జరిగిందని ఆరోపించాడు. పెళ్లిని రద్దు చేశాడు. 

 

ఇంకా చదవండినామినేటెడ్ పదవులు ఆశించేవారు తప్పనిసరిగా ఇలా చేయాలి... ఎమ్మెల్యేలకు పలు కీలక సూచనలు!  

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి 

 

మరోవైపు పెళ్లి ఆపేయాలన్న తండ్రి నిర్ణయంతో పెళ్లికూతురు ఏడ్చింది. ఆమె తండ్రికి నచ్చజెప్పేందుకు వరుడు ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. పెళ్లి రద్దు చేసిన ఆయన అక్కడి నుంచి వెళ్లిపోయాడు. అలాగే పెళ్లికొడుకు, అతడి కుటుంబంతో మాట్లాడవద్దని, వారిలో ఎలాంటి సంబంధాలు వద్దని తన కుమార్తెకు తెగేసి చెప్పాడు. కాగా, ఈ వార్తకు సంబంధించిన పత్రిక క్లిప్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యింది. దీంతో కొందరు నెటిజన్లు సీరియస్‌గా, మరికొందరు ఫన్నీగా స్పందించారు.

 

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

బ‌డ్జెట్‌-2025.. మధ్యతరగతికి భారీ ఊరట.. బడ్జెట్ తో ధరలు దగ్గేవిపెరిగేవి ఇవే!

 

ఆదాయ పన్నుపై కేంద్రం గుడ్ న్యూస్! కొత్త పన్ను విధానంలో.. సీనియర్ సిటిజన్లకు భారీ ఊరట..

 

మ‌హిళల‌కు గుడ్‌న్యూస్.. ఈ ప‌థ‌కం కింద వ‌చ్చే ఐదేళ్ల‌లో రూ. 2కోట్ల వ‌ర‌కు రుణాలు!

 

రాష్ట్రాలకు రూ.1.5 లక్షల కోట్ల రుణాలు ప్రకటించిన కేంద్ర మంత్రి! 50 ఏళ్లకు వడ్డీ రహిత రుణాలు..

 

అమెరికాలో మరో ప్రమాదం.. విమానం కూలడంతో సమీపంలోని ఇళ్లుకార్లు దగ్ధం!

 

చంద్రబాబు అధ్యక్షతన టీడీపీ పొలిట్‌బ్యూరో భేటీ.. నామినేటెడ్‌ పోస్టులపై చర్చ!

 

చంద్రబాబు అధ్యక్షతన టీడీపీ పొలిట్‌బ్యూరో భేటీ.. నామినేటెడ్‌ పోస్టులపై చర్చ! 

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group



   #AndhraPravasi #India #Marriage #Wedding #Bride #Groom